Hyderabad Ganesh Immersion 2022: గణనాథుల నిమజ్జనాలకు అంతా రెడీ.. హుస్సేన్‌సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కోలాహలం నెలకొంది. నగరవ్యాప్తంగా ఉన్న గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సామూహిక వినాయక నిమజ్జనాలకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Hyderabad: భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన కోలాహలం నెలకొంది. శుక్రవారం గణేశ్ నిమజ్జనంకోసం హుస్సేన్ సాగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పై 22 క్రేన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమజ్జనం నేపథ్యంలో రేపు హుస్సేన్ సాగర్ చుట్టూ 12వేలకు పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.

Warangal MGM: వార్డుల్లో ఎలుకల బెడద అవాస్తవం.. ఎంజీఎంను రాజకీయ వేదికగా మార్చొద్దు

నిమజ్జనం కారణంగా హుస్సేన్ సాగర్ లో వ్యర్థాల తొలగింపునకు 20 జేసీబీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా సాగర్ చుట్టూ ఉన్న 200 సీసీ కెమెరాలతో అదనంగా మరికొన్ని కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమరాలను కమాండ్ సెంటర్ కు అనుసంధానం చేయనున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Ganesh Immersion In Hyderabad : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం..భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌

వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాలు, నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల రోడ్లను మూసివేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో రూట్స్ కు సంబంధించిన సందేహాల కోసం ప్ర‌త్యేక‌మైన‌ హెల్ప్‌లైన్ నంబర్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. 040-23002424, 8500411111 నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకొనేలా ఏర్పాట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు