×
Ad

Kcr: ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ.. 5 గంటల పాటు ఎంక్వైరీ

ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

  • Published On : February 1, 2026 / 07:57 PM IST

Kcr Representative Image (Image Credit To Original Source)

  • ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను ప్రశ్నించిన సిట్ బృందం
  • ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం అన్న కేసీఆర్..!
  • తప్పుడు కేసులతో ఇరుకున పడొద్దంటూ సిట్ కు సూచన..!

Kcr: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు (4 గంటల 50 నిమిషాలు) సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన వారి స్టేట్ మెంట్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.

నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో రెండో ఫ్లోర్ లో సిట్ బృందం కేసీఆర్ ను విచారించింది. ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం అని విచారణ అధికారులతో కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు తప్పుడు కేసులతో ఇరుకున పడొద్దంటూ సిట్ కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు సిట్ అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించారు. విచారణను, కేసీఆర్ స్టేట్ మెంట్ ను వీడియో, ఆడియో రూపాల్లో రికార్డ్ చేసుకున్నారు అధికారులు. చాలా అంశాలకు సంబంధించి కేసీఆర్ నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేశారు అధికారులు.

విచారణ అనంతరం.. కేసీఆర్ స్టేట్ మెంట్ రికార్డ్స్, పలు ఫైళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను 2 ట్రంకు డబ్బాల్లో తీసుకెళ్లారు. సిట్ విచారణ ముగిసిన తర్వాత హరీశ్ రావు, కేటీఆర్, ఆర్ ప్రవీణ్ లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. విచారణ తర్వాత పరిణామాలపై గులాబీ బాస్ వారితో చర్చించారు.

Also Read: బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు దక్కినవి ఇవే..

మరోసారి తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నంది నగర్ వెళ్లేందుకు ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డు పైకి వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల జెండాలు పట్టుకుని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ వాతావరణానికి దారితీసింది. పోలీసులు బారికేడ్లు ఎత్తివేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్అ అభిమానులు నందినగర్ వైపునకు వస్తున్నారు. నందినగర్ నివాసం నుంచి బయటకు వచ్చి.. అభిమానులకు అభివాదం చేశారు కేసీఆర్.