డబ్బులివ్వలేదని ఎల్ అండ్ టీ ని వెళ్లగొడుతున్న సీఎం రేవంత్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు.. RRRలో 2500 ఎకరాల స్కాం..

పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీసీ బిల్లుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్నారు. (KTR)

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. చిట్ చాట్ లో ముఖ్యమంత్రిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోనివ్వలేదని ధ్వజమెత్తారు. రేవంత్.. సర్కార్ నడపడం లేదు సర్కస్ నడుపుతున్నారని విమర్శించారు. మంత్రులది ఒక మాట, ముఖ్యమంత్రిది మరొక మాట అని మండిపడ్డారు. కోర్టు చెప్పినా ఈ సీఎం వినరు అని అన్నారు.

సృజన్ రెడ్డికి 300 కోట్ల టెండర్లు.. గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్ట్ లు..!

సృజన్ రెడ్డికి సింగరేణిలో 300 కోట్ల టెండర్లు ఇచ్చారు, గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్ట్ లు ఇచ్చారని ఆరోపించారు. ఫీజురీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు కేటీఆర్. కేసీఆర్ చేసిన పనిని చెప్పలేకపోయాం కాబట్టే ఓడిపోయామన్నారు. రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు ఇచ్చామని గుర్తు చేశారు. కేటీఆర్ పైన కోపం సిరిసిల్లపైన చూపిస్తున్నారని మండిపడ్డారు. చేనేత పై GST వేసిన ఘనత మీదే అని ధ్వజమెత్తారు.

ముంబై పోలీసులు వచ్చి డ్రగ్స్ పట్టుకునే వరకు తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి పక్షంలో నోటికి వచ్చినట్టు రేవంత్ మాట్లాడాు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తెలిసిందన్నారు. 10 నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో అక్కడి స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి ఎన్నిలకు వెళ్లాలని సవాల్ విసిరారు. బీసీ బిల్లుతో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందన్నారు.

సీఎం బంధువుల భూముల రేట్లు పెంచేందుకే..!

RRR లో సౌత్ సైడ్ అలైన్ మెంట్ మార్చారని, సీఎం రేవంత్ బంధువులు 2,500 ఎకరాల భూములు కొన్నారని కేటీఆర్ ఆరోపించారు. అలైన్ మెంట్ మార్చితే RRR కి డబ్బులు ఇవ్వము అని కేంద్రం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. సౌత్ సైడ్ RRR మేమే కడతామని కేంద్రానికి రేవంత్ చెప్పారని కేటీఆర్ తెలిపారు. సౌత్ సైడ్ RRR అలైన్ మెంట్ మార్చడం వల్ల మిగతా ప్రాంతాల్లో కూడా అలైన్ మెంట్ మార్చే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ తన బంధువుల భూములు రేట్లు పెంచేందుకు RRR రోడ్ అలైన్ మెంట్ మార్చారని కేటీఆర్ ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఎల్ అండ్ టీ ముడుపులు ఇవ్వలేదని వాళ్ళను ముఖ్యమంత్రి రేవంత్ బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఎల్ అండ్ టీ వెనక్కి తిరిగి వెళ్తోందన్నారు. ఎంఆర్ కి 25 శాతం వాటా అమ్మేయడానికి రేవంత్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 4వ వ్యక్తిపై ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read: కవితను కలవడానికి జంకుతున్న బీఆర్ఎస్ నేతలు..! ఎందుకంటే?

పాదయాత్ర ఎప్పుడంటే..

చిట్ చాట్ లో పాదయాత్ర గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రకు ఇంకా సమయం ఉందన్నారాయన. మరో మూడేళ్లు ఉందని చెప్పారు. పాదయాత్రకు తొందరేమీ లేదన్నారు. కానీ కచ్చితంగా పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి స్లిమ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నానని తెలిపారు. ఈ మధ్య జిమ్ కు కొంచెం గ్యాప్ ఇచ్చాను, మళ్లీ స్టార్ట్ చేస్తాను, స్లిమ్ అయ్యేందుకు కాదు ఫిట్ గా అయ్యేందుకు అని కేటీఆర్ అన్నారు.