Anjan Kumar Yadav : రెండు సార్లు ఎంపీగా పనిచేశా.. కానీ ఇప్పుడు పెట్రోల్ కి డబ్బులు లేవు.
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని.. మాయమాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం వెళ్లబుచ్చుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోశ్యం చెప్పారు.
- kunduru Vinod
- Published On : July 5, 2021 / 07:53 PM IST
Anjan Kumar Yadav
Anjan Kumar Yadav : టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని.. మాయమాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం వెళ్లబుచ్చుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోశ్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని ముందు నుంచి తాను కోరారని తెలిపారు.
రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించారని.. కానీ ఇప్పుడు అటువంటి నేతలు కనిపించడం లేదని తెలిపారు. ప్రజలు సమస్యలతో అల్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని.. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన తానే పెట్రోల్ పోయించుకోలేక పోతున్నానని.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తున్నారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు కొట్టాలని చూస్తున్నారని, వారి రాజకీయ జీవితం ఇక ఖతమేనని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ఈ నెల 7తేదీన గాంధీభవన్‌లో కొత్త కమిటీ బాధ్యతలు చేపడుతుందన్నారు. తాను ఉజ్జయిని మహంకాళి ఆలయంలో.. పెద్దమ్మ గుడిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూజలు చేసి భారీ ర్యాలీతో గాంధీభవన్‌కు చేరుకుంటామని తెలిపారు అంజన్ కుమార్.
