Srisailam Project : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు శబ్దం.. అధికారులు ఏం చేశారంటే..

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిలోపం కారణంగా

Srisailam Project

Srisailam Power Project : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిలోపం కారణంగా ఏడో నంబర్ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఏడో నంబర్ యూనిట్ లో జనరేటర్ ద్వారా విద్యుత్ ఉ్పత్తి జరుగుతుండగా పేలుడు శబ్దం వచ్చింది. దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా.. అధికారులు యూనిట్ ను మరమ్మతు పనులు చేపట్టారు. సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు ఉధృతి తగ్గింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం వరకు అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ కాగా.. వరద ఉధృతి తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. యుద్ద ప్రాతిపదికన టెలికాం నెట్‌వ‌ర్క్‌ను పునరుద్దరించిన జియో

శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 99,614, ఔట్ ఫ్లో 2,02,923 క్యూసెక్కులు.
నాగార్జున సాగర్ వద్ద ఇన్ ఫ్లో 2,32 లక్షలు, ఔట్ ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు.
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.36 లక్షల క్యూసెక్కులు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,81,694 క్యూసెక్కులు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు