హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో మా స్టాండ్ ఇదే.. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
"త్రిముఖ పోరులో నష్టం జరిగింది. అశ్వారావుపేట, కొత్తగూడెం కార్పొరేషన్లో మాత్రం గెలిచాం" అని రామచందర్రావు అన్నారు.
- మున్సిపల్ ఫలితాల్లో 250 వార్డుల్లో బీజేపీ గెలిచింది
- సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 6 మున్సిపాలిటీల్లో నిలిచింది
- 320 నుంచి 350 వరకు కౌన్సిలర్స్ గెలిచారు
Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ రాణించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
“మున్సిపల్ ఫలితాల్లో 250 వార్డుల్లో గెలిచింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 6 మున్సిపాలిటీల్లో నిలిచింది. తొలిసారిగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు గెలవబోతున్నాం.. దాదాపుగా 320 నుంచి 350 వరకు కౌన్సిలర్స్ గెలిచారు.
నారాయణపేట, ఆదిలాబాద్, రాయికల్ కైవసం చేసుకోబోతున్నాం. గతంలో 2 మున్సిపాలిటీలను మాత్రమే గెలిచాం. మేము ఆదేశించినట్టే ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల అనుకున్న ఫలితం రాలేదు. ప్రభుత్వ తప్పిదాలపై ఛార్జ్ షీట్, కరపత్రంతో ప్రచారం చేశాం. 200 వార్డుల్లో తక్కువ మెజారిటీతో అభ్యర్థులు ఓడిపోయారు.
Also Read: రైళ్లలో పాములు.. భారత్ వ్యాప్తంగా కింగ్ కోబ్రాలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయంటే?
త్రిముఖ పోరులో నష్టం జరిగింది. అశ్వారావుపేట, కొత్తగూడెం కార్పొరేషన్లో గెలిచాం. నల్గొండలో అధికార దుర్వినియోగం జరిగింది. జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు. అన్నీ దుర్వినియోగం చేశారు. ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ రాలేదు. సెకండ్ వచ్చారని బీఆర్ఎస్ నేతలు సంబరపడటం శోచనీయం.
మా పార్టీ ఓట్ శాతం, పార్టీ బలంగా విస్తరిస్తోంది. చాలా చోట్లా బీజేపీ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. బీజేపీ గెలిచే చోటా బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓట్లు వేయాలని మజ్లిస్ పార్టీ చెప్పింది. బీజేపీని ఎదగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాలు అడ్డుకునేందుకు కలిసి పనిచేశాయి. బీజేపీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో విస్తరిస్తోంది. కేరళలో ఎంటరయ్యాం. తెలంగాణ ప్రజలు బీజేపీకి మంచి తీర్పు ఇచ్చారు.
