Harish Rao: పురపోరు ఫలితాలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలించిన హరీశ్ రావు వ్యూహం
ఆరు రోజుల్లోనే 40 చోట్ల సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు హరీశ్ రావు.
Harish Rao Representative Image (Image Credit To Original Source)
- 6 రోజుల్లోనే 40 చోట్ల సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు
- చర్చా వేదికలతో మహిళా ఓటర్లకు చేరువ
- అన్నీ తానై వ్యవహరించిన ట్రబుల్ షూటర్
Harish Rao: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీశ్ రావు వ్యూహం ఫలించింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జోరు చూపింది. 19 మున్సిపాలిటీలలో ఇప్పటికే 11 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో మున్సిపాలిటీ సైతం గులాబీ పార్టీకి దక్కే అవకాశం ఉంది. 11 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఏకపక్షంగా హవా కనబరిచింది. హరీశ్ రావు వ్యూహ రచనతో కీలకమైన పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐదింటికి ఐదు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ దక్కించుకుంది.
ఆరు రోజుల్లోనే 40 చోట్ల సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ నింపారు హరీశ్ రావు. చెట్టు కింద రచ్చబండ చర్చా వేదికలతో మహిళా ఓటర్లకు చేరువ అయ్యారు. కేసీఆర్ దిశానిర్దేశంతో అన్నీతానై వ్యవహరించారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో, నేడు మున్సిపల్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేశారు.
Also Read: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఈ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లకు ఫుల్ డిమాండ్
