Jagtial Crime : జగిత్యాల జిల్లాలో రైతు సజీవ దహనం
జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరగ్గా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది.
- kunduru Vinod
- Published On : December 8, 2021 / 12:34 PM IST
Jagtial Crime
Jagtial Crime : జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరగ్గా.. అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ (54) మంగళవారం తన పొలానికి వెళ్ళాడు. వరి కోసిన అనంతరం మిగిలిన చెత్తకు నిప్పటించాడు. అయితే లక్ష్మణ్ గౌడ్‌కి కంటిచూపు సరిగాలేకపోవడంతో ఆ మంట చుట్టుముట్టిన విషయం గమనించలేకపోయారు.
చదవండి : Jagtial : కాలువలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
ఈ నేపథ్యంలోనే మంటలు అంటుకొని మృతి చెందాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో తన స్నేహితులను ఆరా తీశారు. వారు తమకు తెలియదని సమాధానం చెప్పడంతో వ్యవసాయ పొలానికి వెళ్లి చూశారు కుటుంబ సభ్యులు. కాలిన స్థితిలో అతడి మృతిదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
చదవండి : Jagtial : పెళ్లి చేస్తామని ప్రేమగా ఇంటికి పిలిచి.. యువతిపై దాడి
