Ktr: డెడ్ స్టోరేజ్‌లో నీళ్లు.. కోల్డ్ స్టోరేజ్‌లో ప్రభుత్వం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr)కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Ktr counter to cm Revanth Reddy on water issue in telangana
- రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
- పోచారంపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం
- రైతుల సమస్యలపై తీవ్ర ఆగ్రహం
Ktr: హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr)కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ద్వారా గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పోచారం పరిస్థితి ప్రస్తుతం ‘కుడితిలో పడిన ఎలుకలా’ తయారైందని, ఆయన తన రాజకీయ భవిష్యత్తును తానే సమాధి చేసుకున్నారని విమర్శించారు. బాన్సువాడలో త్వరలోనే మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు దేవుళ్లపై ఒట్టు వేసి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, ఏ సభ పెట్టినా కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, యూరియా అందక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగి 31 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మరమ్మతులు ఎందుకు చేయలేదని నిలదీశారు.
రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కు చేరుతుంటే రేవంత్ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల నియామకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.
