AP Schools Closed: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ఏడు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవులు.. బయటకు రావొద్దని సూచన
AP Schools Closed : ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
AP Red Alert for Several Districts Schools Closed Amid Heavy Rain Forecast
AP Schools Closed : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇవాళ రాత్రికి ఉత్తర కోస్తా – దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్టణం – గోపాల్పూర్ మధ్య తీవ్ర వాయుగుండంగా తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీలోని కూటమి సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
Also Read : PM Kisan-Rythu Bharosa : రైతులకు బిగ్ అలర్ట్ : 8 రోజుల్లో ఈ ఒక్క పని చేయకుంటే పీఎం కిసాన్, రైతుభరోసా బంద్..!
ఏపీలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ సెలవులు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
