Jagtial : కాలువలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ, తన కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.

Jagtial : కాలువలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

Suicide

Updated On : November 21, 2021 / 10:47 AM IST

Jagtial :  ఆత్మహత్యలు చేసుకునేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. చిన్న చిన్న కారణాలకు తనువు చాలిస్తున్నారు. ఈ మధ్య ప్రేమికులు, గృహిణుల ఆత్మహత్యకు అధికమయ్యాయి. చిన్న విషయాలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటు వారిని నమ్ముకున్న వారికి తీరని శోకంలో ముంచుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

చదవండి : Lovers Suicide : పెళ్లైన ఆటో డ్రైవర్‌తో బాలిక ప్రేమ.. ఆర్టీసీ బస్సులో ఆత్మహత్యాయత్నం

మెట్‌పల్లి మండలం ఆత్మనరగ్‌కు చెందిన వనజ (28) ఆరేళ్ళ కుమార్తె శాన్వితో కలిసి వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం ఆత్మనగర్ వద్ద వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతోనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు పోలీసులు.

చదవండి : Couple suicide attempt: పురుగుల మందు తాగి బస్సెక్కిన జంట