Yadadri Bhuvanagiri
Yadadri Bhuvanagiri : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. అధికారులు తమ భూమికి పాసు పుస్తకం ఇవ్వడం లేదని.. ఉప్పలయ్య, అతడి కుమారుడు మహేష్ వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అధికారులు అప్రమత్తమై వారిని కాపాడారు. బాధితుల చెబుతున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆలేరు మండలం కొలనుపాకలో తమకు 4 ఎకరాల భూమి ఉందని ఉప్పలయ్య తెలిపాడు.
చదవండి : Married Woman Suicide : భర్త వేధింపులు భరించలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య
ఆ భూమిని 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి తట్టుకోలేకనే తాము కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు. తమకు న్యాయం జరగదనే అనుమానంతోనే తాము ఇలా చేసినట్లు తెలిపారు ఉప్పలయ్య. ఇక ఇదే సమయంలో తమ భూమికి పాస్ బుక్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు.
చదవండి : SI Raghava Reddy Suicide: మద్యంలో విషం కలుపుకుని తాగి ఎస్ఐ రాఘవరెడ్డి ఆత్మహత్య!