BJP Bandi Sanjay Arrest : కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలు.. బండి సంజయ్ అరెస్టు, 11 సెక్షన్ల కింద కేసు నమోదు

కామారెడ్డి పురపాలక సంఘం మాస్టార్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో రాత్రి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. రాత్రి బండి సంజయ్ అరెస్టుతో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

BJP Bandi Sanjay Arrest : కామారెడ్డి పురపాలక సంఘం మాస్టార్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ తో రాత్రి కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. రాత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుతో కామారెడ్డి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బండి సంజయ్ అరెస్టును బీజేపీ కార్యకర్తలు, రైతులు అడ్డుకున్నా.. ఉద్రిక్తతల మధ్య ఆయను అరెస్టు చేసి, హైదరాబాద్ కు పోలీసులు తరలించారు.

కలెక్టరేట్ ను ముట్టడించిన బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలపై కామారెడ్డి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 353, 188, 323, 427, 341, 506, 143, 147, 148 కింద కేసులు నమోదు చేశారు. దీంతోపాటు రెడు విత్ 149 ఐపీసీ, 3పీడీపీపీఏ సెక్షన్ల కింద బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు.

Kamareddy Collectorate High Tension : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద హైటెన్షన్.. గేటు తాళం పగలగొట్టి కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో రైతులను పరామర్శించనున్నారు. రైతులను పరామర్శించాక రేవంత్ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు