Kukatpally : కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం ప్రశాంత్ నగర్ పారిశ్రామికవాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జీఎస్ఎన్ లైఫ్‌సైన్స్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగసిపడటంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
- kunduru Vinod
- Updated on- July 10, 2021 / 07:48 PM IST
Fire Accident (4)
Kukatpally : కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం ప్రశాంత్ నగర్ పారిశ్రామికవాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జీఎస్ఎన్ లైఫ్‌సైన్స్ ఫార్మా కంపెనీలో మంటలు ఎగసిపడటంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.
మంటల తీవ్రత పెరిగి పక్కనే ఉన్న ఇంటీరియర్ వస్తువుల షాకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
