బోయిన్ పల్లి Delhi Public School లో అగ్నిప్రమాదం

  • Publish Date - September 10, 2020 / 07:55 AM IST

బోయిన్ పల్లిలో ప్రముఖ స్కూళ్లలో ఒకటైన Delhi Public School లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ బుధవారం సాయంత్రం పాఠశాల అడ్మిన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ గదిలో కంప్యూటర్లు, పాఠశాలకు సంబంధించిన రికార్డులున్నాయి.



మంటల ధాటికి అవన్నీ కాలి బూడిదయ్యాయి. మంటలు వస్తుండడం స్కూళ్లో ఉన్న సెక్యూర్టీ సిబ్బంది, స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చెలరేగుతున్న మంటను ఆర్పేందుకు ప్రయత్నించారు.
https://10tv.in/sanjay-dutt-returns-to-shoot-for-shamshera/
దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికంగా ఉన్న వారు భయపడిపోయారు. మంటలను ఆర్పిన అనంతరం లోనికి వెళ్లి చూడగా, వస్తువులన్నీ కాలిపోయాయి. టేబుళ్లు, కంప్యూటర్లు, రికార్డ్స్ అన్నీ దగ్ధమయ్యాయి. భారీగానే ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం. కానీ..మంటలు ఎలా చెలరేగాయో తెలియరావడం లేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ? లేక ఏవరైనా చేశారా అనేది తెలియాల్సి ఉంది.



గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ బిల్డింగ్ లో స్కూల్ ఉందని, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయని ఫైర్ ఆఫీసర్ మధుసూధన్ రావు తెలిపారు. కానీ మంటలు మరింత విస్తరించకుండా ప్రయత్నించామన్నారు.


ట్రెండింగ్ వార్తలు