×
Ad

Fire In Kaveri Travels Bus : బాబోయ్.. హైదరాబాద్ లో అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కావేరీ బస్సు కాలిపోయింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

  • Published On : January 7, 2023 / 11:27 PM IST

Fire In Kaveri Travels Bus : హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కావేరీ బస్సు కాలిపోయింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా దిగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

Also Read..Bus Driver Heart Attack : బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తృటిలో తప్పిన ప్రమాదం, 40మంది యాత్రికులు సురక్షితం

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది. మంటలను ఆర్పివేసింది. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే, అందులో ఉన్న ప్రయాణికులు సేఫ్ గా కిందకు దిగేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయ్యి ఒకరికొకరు అందరూ కిందకు దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే.. మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు కాలిపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. అందులోని ప్రయాణికులు బస్సు దిగేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. కళ్ల ముందే బస్సులో మంటలు చెలరేగడం, చూస్తుండగా మంటలు ఎగసిపడటం, బస్సు మంటల్లో కాలిపోవడం… ప్రయాణికులను షాక్ కి గురి చేసింది. ఒకవేళ తాము బస్సులోనే చిక్కుపోయి ఉంటే.. ఆ ఊహే చాలా భయానకంగా ఉందంటున్నారు. అయితే, బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read..Girl Running Bus : వామ్మో.. అమ్మాయి డేంజరస్ ఫీట్.. విండో ద్వారా రన్నింగ్ బస్‌లోకి ఎలా ఎక్కిందో చూడండి.. వీడియో వైరల్