Bus Driver Heart Attack : బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తృటిలో తప్పిన ప్రమాదం, 40మంది యాత్రికులు సురక్షితం

ములుగు జిల్లా వెంకటాపురంలో తృటిలో ప్రమాదం తప్పింది. బస్ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ట్రావెల్స్ బస్సు అదుపుతప్పింది. అదుపు తప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

Bus Driver Heart Attack : బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తృటిలో తప్పిన ప్రమాదం, 40మంది యాత్రికులు సురక్షితం

Bus Driver Heart Attack : ములుగు జిల్లా వెంకటాపురంలో తృటిలో ప్రమాదం తప్పింది. బస్ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ట్రావెల్స్ బస్సు అదుపుతప్పింది. అదుపు తప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా, 40 యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. యాదగిరి గుట్ట నుంచి భద్రాచలం వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులు ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వాసులుగా గుర్తించారు.

గుండెపోటు వచ్చినా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. బస్సులో ఉన్న 40మంది యాత్రికుల ప్రాణాలు కాపాడాడు. చివరకు తను ప్రాణం వదిలాడు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన వారు మాలధారణ చేశారు. వారంతా దైవ దర్శనానికి పయనం అయ్యారు. యాదగిరి గుట్టను దర్శించుకున్నారు. అనంతరం భద్రాలయం పయనం అయ్యారు.

Also Read..Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

భద్రాచలం రామయ్యను దర్శించుకున్న తర్వాత పర్ణశాల మీదుగా తిరిగి కాణిపాకం వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. మాలధారణ చేసిన వాళ్లు తమ కుటుంబసభ్యులతో కలిసి బస్సులో వెళ్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం వీరభద్రాపురం గ్రామానికి వచ్చాక డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. దాంతో బస్సును అదుపు చేయలేకపోయిన డ్రైవర్ చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు.

Also Read..Heart Attack : చలికాలంలో గుండె పోటు మరణాలు అధికమా! ఎందుకిలా ?

దీంతో బస్సులోని యాత్రికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడ్డారు. ఆ తర్వాత డ్రైవర్ పరిస్థితిని గమనించి వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దారిలోనే డ్రైవర్ మరణించాడు. మొత్తంగా అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్.. 40మంది యాత్రికుల ప్రాణాలు కాపాడాడు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో యాత్రికులంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.