Girl Running Bus : వామ్మో.. అమ్మాయి డేంజరస్ ఫీట్.. విండో ద్వారా రన్నింగ్ బస్‌లోకి ఎలా ఎక్కిందో చూడండి.. వీడియో వైరల్

ఓ అమ్మాయి రన్నింగ్ బస్ లోకి కిటికీలోంచి ఎక్కి అందరినీ విస్మయానికి గురి చేసింది. అబ్బాయిలకు సైతం సాధ్యం కాని ఫీట్ ఆ అమ్మాయి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Girl Running Bus : వామ్మో.. అమ్మాయి డేంజరస్ ఫీట్.. విండో ద్వారా రన్నింగ్ బస్‌లోకి ఎలా ఎక్కిందో చూడండి.. వీడియో వైరల్

Girl Running Bus : కాలేజీ కుర్రాళ్లు కాలేజీకి వెళ్లే సమయంలో బస్సులతో వారు చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. బస్సులకు వేలాడుతూ ప్రయాణిండచం, రన్నింగ్ బస్ లోకి ఠక్కున ఎక్కడం, ఫుట్ బోర్డు మీద ప్రమాదకరంగా నిలబడటం.. ఇలా పలు రకాల ఫీట్లు చేస్తుంటారు. చాలా రిస్క్ అని తెలిసినా, ప్రమాదం అని తెలిసినా.. వాళ్లు భయపడరు. అబ్బాయిలు ఇలాంటి స్టంట్స్ చేయడం చాలా కామన్. అబ్బాయిలు అలా చేయడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ, అమ్మాయిలు ఎవరైనా ఇలాంటి ఫీట్లు చేయడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ. కానీ, ఆ అమ్మాయి చేసింది.

హర్యానాకు చెందిన ఓ అమ్మాయి రన్నింగ్ బస్ లోకి కిటికీలోంచి ఎక్కి అందరినీ విస్మయానికి గురి చేసింది. అబ్బాయిలకు సైతం సాధ్యం కాని ఫీట్ ఆ అమ్మాయి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

ఆ బస్సు విద్యార్థులతో నిండిపోయి ఉంది. ముందు నుంచి కానీ వెనుక నుంచి కానీ బస్సులోకి ఎక్కే అవకాశమే లేదు. బస్సు నిండా విద్యార్థులు ఉన్నారు. అయితే, ఈ బస్సు మిస్ అయితే కాలేజీకి లేట్ అవుతుందని అనుకుందో మరో కారణమో తెలియదు కానీ.. బస్సు రన్నింగ్ లో ఉందని తెలిసినా ఆ అమ్మాయి సాహసం చేసింది. ముందు తన బ్యాగ్ ను కిటికీలోంచి బస్సులో ఉన్న ఫ్రెండ్ కి ఇచ్చింది. ఆ తర్వాత తను రన్నింగ్ బస్ ను పట్టుకుంది. కిటికీలోంచి అమాంతం లోనికి దూరింది. ఇదంతా ఎవరో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అమ్మాయి ఏంటి? ఇలాంటి ఫీట్ చేయడం ఏంటని? అంతా నివ్వెరపోతున్నారు.

Also Read..Viral News: ఓ నివాసంలో బయటపడ్డ 135ఏళ్ల నాటి లేఖ.. సీసాలో ఉంచి భద్రపర్చారు.. అందులో ఏమని రాసిఉందంటే?

దీనిపై నెటిజన్లు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆ అమ్మాయి ధైర్యాన్ని ప్రశంసించారు. బస్సు ఎక్కేందుకు మార్గం లేకపోవడంతో ఆ అమ్మాయి ఇలా బస్సు టైరును ఎక్కి అతి చిన్న కిటికీలోంచి బస్సు లోపలికి ఎక్కాల్సి వచ్చిందన్నారు. మరికొందరు.. ఆ అమ్మాయిని తప్పుపట్టారు. ఇలాంటివి చాలా ప్రమాదకరం అన్నారు. పొరపాటున కింద పడి ఉంటే ప్రాణాలే పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దయచేసి విద్యార్థులెవరూ ఇలాంటి ప్రాణాంతక స్టంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.