VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

ప్రియురాలి కోసం వాళ్లింటికి వెళ్లిన యువకుడు.. కుటుంబ సభ్యుల కంటపడకుండా పారిపోయే క్రమంలో ఇంటిపక్కనే ఉన్న బావిలో పడ్డాడు. ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బావిలో పడిన యువకుడిని బయటకు లాగారు. ఆ తరువాత గ్రామస్తులంతా ఏకమైన యువతి కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమికులను ఒక్కటి చేశారు. ఈ విచిత్ర ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

Young Boy in wall

VIral News: ఓ యువకుడు రాత్రివేళ ప్రియురాలికోసం ఆమె ఇంటికెళ్లాడు.. వారిద్దరు రహస్యంగా గదిలో ఉండగా.. యువతి కుటుంబ సభ్యులు వస్తున్నట్లు శబ్దం వినిపించింది. భయంతో బయటకు పరుగుపెట్టాడు.. అనుకోకుండా పక్కనే ఉన్న బావిలో పడ్డాడు. దీనిని గమనించిన యువతి కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బయటకు లాగారు. తరువాత.. యువకుడిపై దాడికి యత్నించడంతో గ్రామస్తులు జోక్యం చేసుకొని వారిద్దరిని ఏకం చేశారు.. దీంతో ‘బావిలో పడ్డా.. వీడికి అదృష్టం కలిసొచ్చిందని’ అనుకుంటూ గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్

బీహార్‌లోని చాప్రాలో శనివారం రాత్రి విచిత్ర ఘటన జరిగింది. మోతిరాజ్‌పురాకు చెందిన మున్నా‌ రాజ్‌ అదే గ్రామానికి చెందిన ఓ యువతి ప్రేమలో పడ్డారు. అప్పుడప్పుడు రాత్రివేళ యువతి ఇంటికి వెళ్లి రహస్యంగా కలుసుకొని వస్తుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి యువతి తన గదిలో ఒంటిరిగా నిద్రిస్తుండగా.. ఇంటి వెనుక ద్వారం నుంచి లోపలికి వెళ్లాడు. యువతితో రహస్యంగా గదిలో ఉన్న సమయం.. యువతి కుటుంబ సభ్యులు వస్తున్నట్లు అనిపించింది. ఇంకేముంది మున్నా రాజ్ అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు.

Viral News: ఓ నివాసంలో బయటపడ్డ 135ఏళ్ల నాటి లేఖ.. సీసాలో ఉంచి భద్రపర్చారు.. అందులో ఏమని రాసిఉందంటే?

యువతి కుటుంబ సభ్యుల కంటపడకుండా పారిపోయే క్రమంలో ఇంటిపక్కనే ఉన్న బావిలో పడ్డాడు. ఇది గమనించిన యువతి కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బావిలో పడిన మున్నారాజ్ ను బయటకు తీశారు. తరువాత ఆగ్రహంతో మున్నా రాజ్ పై యువతి కుటుంబ సభ్యులు దాడికి యత్నించడంతో గ్రామస్తులు వారిని వారించారు. కొద్దిసేపులో వారి మధ్య ఘర్షణ జరిగింది. చివరికి పంచాయతీ పెట్టి చర్చించారు. గ్రామస్తులంతా మున్నారాజ్ కు యువతి పెళ్లిచేయాలని నిర్ణయించి యువతి కుటుంబ సభ్యులను ఒప్పించారు. దీంతో స్థానిక దేవాలయంలో వీరి పెళ్లిని నిర్వహించారు. స్థానికంగా ఈ విచిత్ర ఘటన వైరల్ కావడంతో.. బావిలో పడ్డా ప్రియురాలిని దక్కించుకున్నాడని చర్చించుకోవటం గమనార్హం.