మెడికల్ వండర్.. 16 నెలల చిన్నారికి 1600 కిలోమీటర్ల దూరం నుంచి డాక్టర్ ఆపరేషన్.. సర్జరీ చేశారిలా..

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వీ చంద్రమోహన్ వివరాలు తెలిపారు.

Tele robotic surgery

Tele robotic surgery: వైద్యులు టెలీ రోబోటిక్ సర్జరీని విజయవంతంగా చేశారు. రోబోటిక్ సర్జరీలు, టెలీ మెడిసిన్‌ను కలిపి ఆపరేషన్‌ చేసే ప్రక్రియను టెలీ రోబోటిక్ అంటారు. ఈ వైద్య ప్రక్రియకు నాంది పలికి అరుదైన ఘనత సాధించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వీ చంద్రమోహన్ వివరాలు తెలిపారు. ఓ బాలుడికి పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత జన్యుసమస్య ఉందని అన్నారు.

ఆ చిన్నారికి ఇప్పుడు 16 నెలల వయసని తెలిపారు. అతడికి కిడ్నీ నుంచి మూత్రకోశంలోకి మూత్రం వెళ్లడం లేదని, ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ బాలుడి వయసు చాలా తక్కువ కావడంతో రోబోటిక్ ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read: తెలంగాణను వదలని వర్షాలు.. ఇక హైదరాబాద్‌లోనైతే.. నేడు కూడా ఈ జిల్లాల్లో..

అతడిని హైదరాబాద్‌, కొండాపూర్‌లోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. డాక్టర్ చంద్రమోహన్ గుర్‌గ్రామ్‌లోని ఎస్ఎస్ఐ మంత్ర ఆఫీసులోని కన్సోల్ వద్ద కూర్చొని ఆ బాలుడికి ఆపరేషన్ చేశారు.

హైదరాబాద్‌ నుంచి గురుగ్రామ్‌కు 1,600 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. వైద్యుడు అక్కడి నుంచే బాలుడికి ఇక్కడి రోబోతో ఒక్క గంటలో ఆపరేషన్ చేశారు. ఇందుకు గంట సమయం పట్టింది. 5జీ టెక్నాలజీతో పాటు రోబోటిక్ సర్జరీ వల్ల ఇది సాధ్యమైందని చంద్రమోహన్ చెప్పారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళకు గర్భసంచి తొలగింపు ఆపరేషన్‌ను హైదరాబాద్ నుంచి 5జీ ఇంటర్నెట్ ప్లాట్‌ఫాం, ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్టం, టెలీ సర్జరీ సాయంతో చేశారు. సర్జరీ చేసే డాక్టర్ వద్ద హ్యాండ్స్ సెన్సార్ ఎలక్ట్రో మాగ్నిటిక్ బెస్ అనే చైర్ ఉంటుంది. వైద్యులు ఇంట్లో ఉండి కూడా ఇటువంటి సర్జరీలు చేయవచ్చు. హాస్పిటల్‌లోనూ వైద్యులు అందుబాటులో ఉండాలి.