చైతన్యపురిలో వరద, లెక్క చేయని వాహనదారులు, ప్రొక్లెన్ల సహాయంతో ప్రజల తరలింపు

  • Publish Date - October 18, 2020 / 10:24 AM IST

flood in chaitanyapuri : హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..అత్యవసరమైతే తప్ప..బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నా..కొంతమంది పట్టించుకోవడం లేదు. బేఖాతర్ చేస్తూ..వాహనాలు తీసుకుని రోడ్డెక్కుతున్నారు. పలు ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసుు ఆపే ప్రయత్నం చేస్తున్నా..ఏదో ఒక కారణం చెబుతూ..ముందుకు వెళుతున్నారు.



ప్రధాన మార్గాల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నారు. చైతన్యపురిలో పరిస్థితి దారుణంగా తయారైంది. నడుం లోతు నీళ్లు ఉన్నా..వాహన దారులు లెక్క చేయడం లేదు. రయ్యి రయ్యి అంటూ దూసుకెళుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే..ఎలా అని ఆలోచించడం లేదు.



క్యుములోనింబస్‌ మేఘాల తీవ్రతతో వర్షం కురిసింది. ఎంతో రద్దీగా చైతన్యపురిలో ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. సరూర్ నగర్ చెరువు పక్కనే ఓ నాలా ఉంటుంది. ఇది పొంగి పొర్లుతుండడంతో భారీగా వరద నీరు పోటెత్తింది. సమీపంలోని కాలనీల్లో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.



మనిషి లోతు నీళ్లు ఉండడంతో..చిక్కుకపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జేసీబీలు, ప్రొక్రెన్ల సహాయంతో..తరలిస్తున్న దుస్థితి నెలకొంది. బోట్ల సహాయంతో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చైతన్యపురి – దిల్ సుఖ్ నగర్ మధ్య భారీగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు