Chikoti Praveen : జూపార్క్‌లా ఉన్న చికోటి ఫాంహౌస్..షాక్ అయిన ఫారెస్ట్ అధికారులు
క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ పై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. జైపార్క్ ను తలపిస్తున్న చికోటీ ఫామ్ హౌస్ లో అరుదైన వన్యప్రాణులున్నాయి. ఉడుములు, ఊసరవెల్లులు, బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు, ఆవులు ఇలా ఒకటేంటీ అది షామ్ హౌసా? లేదా జూనా? అనేలా ఉంది.
- nagamani
- Published On : July 30, 2022 / 10:45 AM IST
Forest Officers Raid On Chikoti Praveen Farm House
forest officers raid on chikoti praveen Farm house : క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్ కుమార్ నివాసంలో ఈడీ దాడుల అతనంతరం అతని చీకటి కోణాలు ఎన్నెన్నో వెలుగులోకి వచ్చాయి. వస్తునే ఉన్నాయి. ఎంతోమంది రాజకీయనాయకులు..సినీ సెబ్రిటీల చికోటి కష్టమర్లు. ఈడీ సోదాల తరువత దిమ్మతిరిగే వాస్తవాలు వెల్లడి అవుతున్న క్రమంలో చికోటి ఫాంహౌస్‌పై అధికారులు దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సాయిరెడ్డిగూడలో 12 ఎకరాల్లో ఉన్న చీకోటి ప్రవీణ్ ఫాంహౌస్‌లో శుక్రవారం (7,2022)జంతు అక్రమ రవాణా నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Also read : Casinor Chikoti Praveen : గల్లీ నుంచి మొదలైన..క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్ ప్రస్థానం
ఫాం హౌస్‌లో మాట్లాడే రామచిలుకలు, ఉడుములు, ఊసరవెల్లులు, బల్లులు, ఆస్ట్రిచ్, గుర్రాలు, కుక్కలు, ఆవులు ఇతర జంతువులను చికోటీ పెంచుతున్నట్లుగా గుర్తించారు. మినీ జూను తలపిస్తున్న ఫాంహౌస్ బాధ్యతను చికోటి మేనమామ చూసుకుంటున్నారు. గతంలోనే వన్యప్రాణులను పెంచుకునేందుకు చికోటి అనుమతులు తీసుకున్నాడు. ఈడీ అధికారుల తనిఖీలు తరువాత ఫారెస్ట్ అధికారులు అనుమతులు లేని జంతువులను పెంచుతున్నారనే అనుమానంతో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కానీ చికోటి ఫామ్ హౌస్ లో ఉన్న జంతువులను చూసి అధికారులే షాక్ అయ్యారు.
ఇత్తడి కళాకృతులు, పురాతన రథం ఉన్నట్టు తెలిపారు.
మినీ జూపార్క్‌ను తలపించేలా ఉంది చికోటీ ఫామ్ హౌస్. కందుకూరు అటవీ రేంజ్ అధికారులతో పాటు జంతు అక్రమ రవాణా నియంత్రణ అధికారులు, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ జంతువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఫాంహౌస్ నిర్వహిస్తున్నారనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
Also read : Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్..అలియాస్ క్యాసినో ప్రవీణ్..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్
చికోటికి ఉన్న నెట్ వర్క్..పరిచయాలు అంతా ఇంతాకాదు. అంతర్జాతీయంగా ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలున్నాయి. సన్నిహిత సంబంధాలున్నాయి. సైదీ అరేబియాలో కూడా చికోటీకి కాంటాక్ట్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా దివంగత రాజు అబ్దుల్లా ఇంటికి చికోటి యానిమల్ ట్రైనర్ ను పంపించాడంటే అతని రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అబ్దుల్లా పెంచుకునే పులులు, సింహాల ఆలనా పాలనా చూసుకోవటానికి చికోటీ అలీ అనే ఓ యానిమల్ ట్రైనర్ ను పంపించాడు. ఇలా ఇదే కాదు అతని రేంజ్ ఏంటో అధికారుల విచారణలో మరింతగా బయటపడనున్నాయి.
