×
Ad

మందుబాబులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్.. ఎప్పటినుంచంటే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎవరు గెలుస్తారు? అన్న విషయంపై బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి.

Hyderabad: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్‌లో జిల్లాలో ఆదివారం నుంచి నాలుగు రోజులు వైన్స్‌ షాపులు బంద్‌ ఉంటాయి. దీంతో మందుబాబులు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఇవాళే మందు కొనుక్కుని పెట్టుకుంటున్నారు.

ఉప ఎన్ని ఎన్నిక వేళ ఎక్సైజ్‌ శాఖ ఆంక్షల నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి ఈ నెల 12 వరకు వైన్‌ షాపులు తెరుచుకోవు. మద్యం షాపులతో పాటు బార్లు, కల్లు దుకాణాలు వంటి అన్నీ మూసేయాల్సిందే.

ఈ నెల 11 పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 12 వరకు ఆంక్షలు ఉంటాయి. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. (Hyderabad)

Also Read: 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం

మరోవైపు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎవరు గెలుస్తారు? అన్న విషయంపై బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నిక రెండేళ్ల పాలన రిఫరెండమన్న వాదన కూడా ఉంది. బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండనున్న దానిపై కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం చూపుతుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.