Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.

Maharashtra Road Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ రాష్ట్ర వాసులు దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్ దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తుఫాన్‌ వాహనం-లారీ ఢీ

బాధితుల్లో ఆరుగురు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులని తెలిపారు. వారిలో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టీ)కి చెందినవారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు