Free Movie Screening : హైదరాబాద్ వాసులకు శుభవార్త.. టికెట్ కొనే పని లేదు.. ఫ్రీగా సినిమాలు చూడొచ్చు.. సిటీలోనే.. ఎక్కడంటే

Free Movie Screening : హైదరాబాద్ నగర వాసులకు పండగలాంటి వార్త. ఉచితంగా సినిమాలు చేసే అవకాశం

free open air movie screening in hyderabad at nampally public garden

  • నగరంలో ఉచితంగా సినిమాల ప్రదర్శన
  • ఓపెన్ ఎయిర్ థియేటర్లలో సినిమాలు
  • నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ

Free Movie Screening : సినిమా టికెట్ ధరలు చూసి చాలా మంది థియేటర్ కి వెళ్లి మూవీ చూడటమే మానేశారు. నెల రోజులు ఆగితే ఓటీటీల్లో వస్తుంది కదా అని ఫీలవుతున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా సినిమాలు చూడవచ్చు. అది కూడా పచ్చని ప్రకృతిలో సేదతీరుతూ.. ఆకాశం కింద కూర్చుని ‘ఓపెన్ ఎయిర్ థియేటర్’లో సినిమా చూడవచ్చు. కొన్నాళ్ల క్రితం వరకు నగరంలో ఇలాంటి ఓపెన్ ఎయిర్ థియేటర్లు ఉండేవి. ఇప్పుడు మళ్లీ వాటిని నగరవాసుల ముందుకు తీసుకురాబోతున్నారు. నాంపల్లిలోని చారిత్రక పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న ‘లలిత కళాతోరణం’ దీనికి వేదిక కానుంది. హైదరాబాద్ నగరవాసులకు ఫ్రీగా వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో తెలంగాణ పర్యాటక శాఖ ఈ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఓటీటీలు, మొబైల్ ఫోన్లతో బిజీగా గడుపుతున్న నేటి తరానికి.. ఈ ఓపెన్ ఎయిర్ సినిమా సంస్కృతిని పరిచయం చేయడం కోసమే తెలంగాణ పర్యాటక శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దీనికోసం లలిత కళాతోరణంలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను, అధునాతన సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ ప్రతి రోజు సాయంత్రం 6:00 గంటలకు సినిమాలు ప్రారంభమవుతాయి.

ఏ సినిమాలు ప్రదర్శిస్తున్నారంటే:

బుధవారం కోర్టు సినిమాను ప్రదర్శించగా.. రేపు (ఏప్రిల్ 16)న ‘తండేల్’ సినిమాను ప్రదర్శించనున్నారు. ఏప్రిల్ 17న ‘బలగం’.. ఏప్రిల్ 18న ‘జనతా గ్యారేజ్’ సినిమాను ప్రదర్శించనున్నారు.

ఎంట్రీ ఫీజు లేదు..

ఈ సినిమాలను చూడటానికి వచ్చే వారు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. టికెట్ల గోల, క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా నేరుగా పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకుని పచ్చని ప్రకృతిలో కూర్చుని.. హాయిగా సినిమాలను ఎంజాయ్ చేయవచ్చు. వీకెండ్ సమయంలో మాల్స్‌కు వెళ్లడం కంటే, కుటుంబ సభ్యులందరూ కలిసి ఇలాంటి ప్రదేశాలకు వచ్చి అందరితో కలిసి ఓపెన్ ఎయిర్ థియేటర్లలో సినిమా చూసి సరికొత్త అనుభవాలను మీ సొంతం చేసుకోవచ్చు.. కళాభిమానులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.