GHMC Deputy Mayor : బీఆర్ఎస్‌కు గట్టి షాక్.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి రాజీనామా

GHMC Deputy Mayor Srilatha Shoban Reddy to Join in Congress

GHMC Deputy Mayor : గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యుత్వానికి, ఆ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు.

Read Also : TDP Janasena First List : టీడీపీ- జనసేన ఫస్ట్‌లిస్ట్‌లో సీనియర్లకు నో చాన్స్‌

రేపు ఆదివారం (ఫిబ్రవరి 25) ఉదయం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో దీపామున్షి సమక్షంలో డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు మనగాడలేదంటూ మోతే దంపతుల రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు ఆరుగురు బీఅర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు.

జీహెచ్ఎంసీ నాదే.. నేను ఇక్కడే ఉంటాను :
పార్టీ విధానాలతో తమకు నష్టం వాటిల్లిందని డిప్యూటీ మేయర్ శ్రీలత లేఖలో పేర్కొన్నారు. పాతికేళ్లుగా బీఆర్ఎస్‌లో ఉన్నామని, ఉద్యమంలో పోరాటం చేశామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని వాపోయారు. పార్టీ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడంతో చాలా బాధపడ్డారన్నారు.

పార్టీలో ఇంపార్టెంట్ రోల్ లేకపోవడంతోనే తాము మనస్తాపానికి గురయ్యామని చెప్పారు. పార్టీలో కష్టపడిన పనిచేసినా గుర్తింపు లేదని, కనీసం ఎమ్మెల్యే టికెట్ అడిగినా కూడా ఇవ్వలేదన్నారు. ఎంపీ సీటు ఆశించినా అది కూడా కుదరదని అన్నారని తెలిపారు. కేటీఆర్‌ను కలిసేందుకు వెళ్లినా కూడా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌లో న్యాయం జరగలేదనే పార్టీ నుంచి వెళ్లిపోతున్నామని డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి స్పష్టం చేశారు. మొదట మేయర్ ఆశించగా.. డిప్యూటీ పదవి ఇచ్చారని అన్నారు. తమకు కాంగ్రెస్ మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ నాదే.. నేను ఇక్కడే ఉంటాను.. మాతో పాటు ఎవరెవరు అనేది త్వరలో మీరే చూస్తారని అన్నారు.

Read Also : AP Politics : టీడీపీ-జనసేన అభ్యర్థులను చూస్తుంటే..: ఏపీ మంత్రుల కామెంట్లు

ట్రెండింగ్ వార్తలు