ghmc elections 2020 results: గ్రేటర్‌లో కాసేపట్లో తొలి రౌండ్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలిరౌండ్‌లో మెహదీపట్నం ఫలితం వెలువడనుంది. రెండో రౌండ్ అనంతరం మరో 136 డివిజన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. మూడో రౌండ్ లో 13 డివిజన్ల ఫలితాలు తేలనున్నాయి.
చివరిగా మైలార్ దేవ్ పల్లి డివిజన్ ఫలితం వెలువడనుంది. హైదర్ నగర్ లో తొలి రౌండ్ పూర్తి అయింది. హైదర్ నగర్ లో కాసేపట్లో తొలి రౌండ్ ఫలితం వెల్లడికానుంది. రెగ్యులర్ బ్యాలెట్ మొదటి రౌండ్ లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం దాదాపు 35 లక్షలు ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇప్పటివరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 34,71,353 ఓట్లు పోలయ్యాయి.