తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇళ్లకు జీహెచ్ఎంసీ ప్రత్యేక నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లో కరోనా కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను జీహెచ్ఎంసీ అమలు చేస్తోంది. ఎక్కడికక్కడ ఇంట్లో ఉండి, ఐసోలేషన్ లో ఉన్నవారికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెబుతునే మరోవైపు వారి ఇంటికి ఎవరూ కూడా రావద్దంటూ, ఎవరు కూడా విజిట్ చేయొద్దంటూ నోటీస్ బోర్డును ఏర్పాటు చేసింది.
ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఐసోలేషన్ కొనసాగుతుంది. ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అతను ఐసోలేషన్ లో ఉంటాడన్న అంశాలతోపాటు ఎవరైతే పేషెంట్ ఉంటాడో అతని పేరు, పేషెంట్ ఐడీ ప్రభుత్వం పాజిటివ్ వ్యక్తికి పేషెంట్ ఐడీ కేటాయిస్తుంది. పేషెంట్ ఐడీని రాస్తున్నారు. ఇక్కడికి ప్రతిసారి ఏ ఏ అధికారి వచ్చాడు. ఏం చేశాడు.. తేదీ, టైమ్, విజిట్ అయిన సంతకం చేయాల్సివుంటుంది. మెడికల్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది ఎవరు విజిట్ చేశారనే సమాచారం తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్నీ జీహెచ్ఎంసీ వినూత్నంగా చేపట్టింది.
ప్రధానంగా ఇంట్లో ఉండే పేషెంట్ బయటికి వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం, బయటి వ్యక్తులు ఆ ఇంటికి రాకుండా ఉండేందుకు గతంలో హౌస్ కస్టర్ ఏర్పాటు చేసి చుట్టుముట్టూ ఇంట్లోకి ఎవరు వెళ్లకుండా అవసరమైతే గేట్లు తాళాలు వేయడం లేదా ఇతర చర్యలు తీసుకోవడం, బంధించివారు. ఇప్పుడు ఆ పద్ధతి అమల్లో లేదు కాబట్టి పూర్తిగా మారిపోయింది కాబట్టి ఈ పద్ధతిలో చేస్తున్నారు.