Child Welfare: తన పెళ్లి ఆపమంటూ ఫోన్.. సన్మానం చేసిన అధికారులు

ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. తల్లిదండ్రుల వ్యవహారంలో మాత్రం మార్పు రావట్లేదు. బాల్య వివాహాలు విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ వెంటనే రంగంలోకి దిగేస్తున్నారు.

Girl Called to Childline: ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. తల్లిదండ్రుల వ్యవహారంలో మాత్రం మార్పు రావట్లేదు. బాల్య వివాహాలు విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ వెంటనే రంగంలోకి దిగేస్తున్నారు. కానీ, అక్కడక్కడ ఇంకా కూడా ఎంతోమంది అమ్మాయిలకు పెళ్లి వయసు రాకుండానే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే మైనార్టీ తీరకుండానే పెళ్లి చేయాలని చూస్తున్నారంటూ ఓ బాలిక స్వయంగా చైల్డ్‌లైన్‌ అధికారులకు సమాచారం ఇచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడమే కాక, బాలికను సన్మానించారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన బాలిక(16) ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోండగా.. ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించారు పెద్దలు.

ఈ క్రమంలోనే బాలిక.. చైల్డ్‌లైన్‌ నంబర్‌ 1098కు ఫోన్ చేసి తన పెళ్లిని అడ్డుకోవాలని కోరింది. బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు గ్రామానికి చేరుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మైనార్టీ తీరాకే పెళ్లి చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం రాయించుకుని, ధైర్యంగా సమాచారం ఇచ్చినందుకు బాలికను సన్మానం చేశారు అధికారులు. చదువుకుని డాక్టర్‌ కావాలనేది లక్ష్యమని బాలిక ఈ సంధర్భంగా చెప్పింది. గ్రామంలో మరో బాల్యవివాహాన్ని కూడా అధికారులు అడ్డుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు