Weight Loss Hair Loss : వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతున్న వారికి షాకింగ్ న్యూస్.. ఈ సైడ్ ఎఫెక్ట్ ?
Weight Loss GLP-1 Hair Loss : బరువు తగ్గాలనే ఆరాటంలో GLP-1 వంటి వెయిట్ లాస్ మందులు వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
- Harish Thanniru
- Published on- August 2, 2026 / 06:29 PM IST
Weight Loss GLP-1 Hair Loss
Weight Loss GLP-1 Hair Loss : బరువు తగ్గాలనే ఆరాటంలో GLP-1 వంటి వెయిట్ లాస్ మందులు వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. వేగంగా బరువు తగ్గడం ఆనందాన్నిస్తే.. అదే సమయంలో జుట్టు రాలే సమస్యను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దుష్ప్రభావానికి కారణాలేంటి? దాన్ని ఎలా నివారించాలో తెలుసుకుందాం.
Also Read : Narendra Modi : మోదీని దూషించిన బాలిక కేసు.. తల్లి భావోద్వేగ వ్యాఖ్యలు వైరల్! ప్రధానికి కీలక విజ్ఞప్తి..
బరువు తగ్గేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న GLP-1 (గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్-1) మందులు మరో కొత్త ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ మందుల వాడకం వల్ల వేగంగా బరువు తగ్గుతున్న కొందరిలో తీవ్రమైన జుట్టు రాలే సమస్య కనిపిస్తోందని చర్మవ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహం చికిత్స కోసం రూపొందించిన ఈ మందులు ప్రస్తుతం ఊబకాయం తగ్గించడంలో కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల వైద్యుల వద్దకు వచ్చే రోగుల్లో వేగంగా బరువు తగ్గిన తర్వాత జుట్టు అధికంగా రాలుతున్న కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వైద్యుల అభిప్రాయం ప్రకారం… ఈ సమస్యకు మందులే నేరుగా కారణమని చెప్పలేం. కానీ చాలా తక్కువ సమయంలో భారీగా బరువు తగ్గడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరగడం, ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్లు వంటి పోషకాల లోపం ఏర్పడడం వల్ల జుట్టు రాలే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యను కొందరు నిపుణులు “ఓజెంపిక్ హెయిర్” (Ozempic Hair) అని కూడా పిలుస్తున్నారు. ఇదివరకు ఈ మందుల వాడకంతో ముఖం సన్నబడే సమస్యను “ఓజెంపిక్ ఫేస్” గా పిలిచినట్లే, ఇప్పుడు జుట్టు రాలడం కూడా చర్చనీయాంశంగా మారింది.
అయితే నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ సమస్య ప్రతిఒక్కరిలో కనిపించదు. అత్యధిక మందిలో జుట్టు రాలడం తాత్కాలికమే అయి ఉండొచ్చు. జుట్టు రాలే సమస్యను ఎదుర్కొనేవారు సరైన పోషకాహారం, తగిన ప్రోటీన్, విటమిన్లు తీసుకోవడం, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగించడం ద్వారా సమస్యను నియంత్రించవచ్చనని సూచిస్తున్నారు. అలాగే వైద్యుల సలహా లేకుండా బరువు తగ్గే మందులు వాడకూడదని హెచ్చరిస్తున్నారు.
