Online Classes : కరోనా నేపథ్యంలో ఇంకా స్కూళ్లు తెరుచుకోలేదు. అయితే..కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తున్నాయి. కొంతమంది స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో చదువుకు దూరంగా ఉంటున్నారు. నిరుపేదలు ఫోన్ కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప్పులు చేసి ఫోన్లు కొనిచ్చి ఇస్తున్నారు.
ఇలాగే…ఎల్లారెడ్డిపేటలో ఓ నిరుపేద కుటుంబం ఉంటోంది. తన తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం రాకుడదనే ఉద్దేశ్యంతో..విద్యార్థి కూలీ పనికి వెళ్లి సెల్ ఫోన కొనుక్కోంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం మాజీ సర్పంచ్ చాకలి రజిత – రాములు దంపతులు నివాసం ఉంటున్నారు. ఈమెకు దివ్య పెద్ద కూతురు ఉంద. తల్లి చాకలి రజిత 2006-12 మధ్య సర్పంచ్‌గా పని చేసినా, ప్రజా సేవకే అంకితమైంది. దివ్య టీఎస్‌డబ్ల్యూ డీసీలో బీఎస్సీ (ఫుడ్‌సైన్స్) కోర్సు చదువుతోంది. ఆన్ లైన్ పాఠాలు బోధిస్తున్నారు.
కానీ..నిరుపేద కుటుంబం కావడంతో ఫోన్ కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. రజిత తల్లిదండ్రులను ఏమీ అడగలేక నెల రోజులపాటు కూలీ పనులకు వెళ్లి ఓ మొబైల్ ఫోన్ కొనుక్కుంది. సమయం దొరికినప్పుడల్లా చేను పనులకు వెళ్తూ ఆన్‌లైన్ క్లాసులు వింటోంది. అందరూ ఆమెను అభినందిస్తున్నారు.