Telangana New Schemes : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. రేవంత్ సర్కార్ మరో కొత్త పథకం.. వారందరికీ రూ.5లక్షలు
Telangana Govt Schemes: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.
- Harish Thanniru
- Updated on- May 21, 2026 / 12:18 PM IST
Telangana Revanth Reddy Govt Has Another New Scheme Rs 5 Lakhs
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- రేవంత్ సర్కార్ మరో కొత్త పథకం
- రేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.5లక్షలు బీమా
Telangana Govt New Schemes: తెలంగాణలోని రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డు ఉన్న పేద కుటుంబాలకు రూ.5లక్షల జీవిత బీమా అందించే “ఇందిరమ్మ జీవిత బీమా” పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రారంభించనుంది. అదేరోజు మరికొన్ని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.
Also Read : Chandrababu Naidu : రోడ్డుపక్కన ఆగి.. తాటి ముంజలు తిన్న చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు వైరల్
రేషన్ కార్డు కలిగిఉన్న వారికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.15కోట్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం అమలుకానుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.4వేల కోట్లు కేటాయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ విధివిధానాలను సిద్ధం చేసింది. జూన్ 2న ఎల్ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
జూన్ 2వ తేదీన మరికొన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది. చేయూత పథకం కింద కొత్తగా రెండు లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు, తదితర పెన్షన్లను మంజూరు చేసి, పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలుపుకొని దాదాపు 23.51లక్షల మందికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పూర్తిగా నగదు రహిత (క్యాష్ లెస్) వైద్య సౌకర్యం కల్పించేందుకు డిజిటల్ హెల్త్ కార్డులను జూన్ 2 నుంచి పంపిణీ చేయనున్నారు.
Also Read : Telangana Elections: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా? కారణం అదేనా?
