TGPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఈ సారి ఏకంగా ఎన్ని పోస్టులంటే..

Telangana Govt :ఈ నెలలోనే 1597 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించడంతోపాటు ఉద్యోగ నియామకాల బోర్డు త్వరలోనే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Telangana TGPSC

  • తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
  • 1597 పోస్టుల ఖాళీల భర్తీకి సిద్ధమైన టీజీపీఎస్సీ
  • ఈ నెలలోనే నోటిఫికేషన్..

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయించింది. ఇప్పటికే రెండు శాఖల్లో 290 పోస్టుల భర్తీకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Also Read : TG Doctors Strike : డాక్టర్ల సమ్మెబాట.. నేటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్.. వైద్యుల డిమాండ్లు ఇవే! జీవో నంబర్ 38 అంటే ఏమిటి?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 1800 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఈ నెలలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అవుతాయని చెప్పారు. ఈ క్రమంలో ఇప్పటికే 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకాగా.. మరో 15,97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమైంది.

ఈ నెలలోనే 1597 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించడంతోపాటు ఉద్యోగ నియామకాల బోర్డు త్వరలోనే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 1,597 పోస్టుల్లో 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 24 డిప్యూటీ డీఈవో, 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఇప్పటి వరకు 67 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతోంది.