×
Ad

Presidential Elections 2022 : ఆర్జీవీ తాగి ట్వీట్ చేస్తాడు-బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై   గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు.

  • Published On : June 24, 2022 / 04:45 PM IST

Presidential Elections 2022

Presidential Elections 2022 :  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై   గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై ఆర్జీవి నిన్న చేసిన ట్వీట్ తో ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నేతలు మండి పడుతున్నారు. రాంగోపాల్ వర్మ తాగి ట్వీట్స్ చేస్తారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు.

ఆర్జీవీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నిస్తూ ఉంటారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ద్రౌపది ముర్ముపై వర్మ చేసిన ట్వీ్ట్ ను ఆయన ఖండించారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరం  అని రాజా సింగ్ అన్నారు.

Also Read : Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు