Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు | Presidential Election 2022

Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు

సంచలన దర్శకుడు రామ్‌‍‌‌గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి   ద్రౌపది ముర్ముపై ఆయన తన ట్విట్టర్ లో స్పందించారు.

Presidential Election 2022 : వర్మను మానసిక వైద్యుడికి చూపించాలి-సోము వీర్రాజు

Presidential Election 2022 : సంచలన దర్శకుడు రామ్‌‍‌‌గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి   ద్రౌపది ముర్ముపై ఆయన తన ట్విట్టర్ లో స్పందించారు. RGV   వ్యాఖ్యలు కించ పరిచేలా ఉన్నాయని… ఆర్జీవీపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతున్న సందర్భంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పోలీసుశాఖ వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్రపతి అభ్యర్ధి పేరును సెటైరికల్‌గా వాడటం అంటే రామ్ గోపాల్ వర్మ తన పరిధికి మించి వ్యవహరించడమే  అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

కాగా.. గురువారం రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో ఇలా రాశారు. ‘‘ ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేశారు.

వర్మ అడుగుజాడల్లో ఎవరూ వెళ్ళకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలని ఆయన అన్నారు. రాంగోపాల్‌వర్మని మానసిక వైద్యుడి చూపించాల్సిన అవసరం ఏర్పడిందని వీర్రాజు అన్నారు. వాక్ స్వాతంత్ర్య హద్దును కూడా దాటి ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Also Read : Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు 

×