Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు 

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో ఆమెతో పాటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర‌ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా ఉన్నారు.

Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు 

New Project (19)

Presidential election: ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ము ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో ఆమెతో పాటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర‌ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఇతర నేతలు కూడా ఉన్నారు. ద్రౌపది ముర్ముకు ఆయా నేతలు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Maharashtra: శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజ‌య్ రౌత్

కాగా, ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌ధాని మోదీ తొలి సంత‌కం చేశారు. అలాగే, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కూడా ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతూ సంత‌కాలు చేశారు. అంత‌కుముందు ముర్ముని అభ్య‌ర్థిగా పేర్కొంటూ బీజేపీ మొత్తం నాలుగు సెట్ల నామినేష‌న్లు సిద్ధం చేసుకుంది. మ‌రోవైపు, విప‌క్షాల రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. ఆయ‌న కూడా దేశంలోని ప‌లువురు నేత‌ల‌ను క‌లిసి మ‌ద్ద‌తు అడ‌గ‌నున్నారు. కాగా, నామినేషన్ వేసే ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌కు ద్రౌపతి ముర్ము ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు.