Padi Kaushik Reddy: టార్గెట్ కరీంనగర్ సీపీ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణల వెనుక మ్యాటరేంటి?
కౌశిక్ రెడ్డి ఆరోపణలతో పోలీస్ శాఖలో ఉలికిపాటు మొదలైంది. కౌశిక్ అలిగేషన్స్ చేయడానికి సమాచారం ఎవరిచ్చారనేది తేల్చే పనిలో పడ్డారట పోలీస్ లు. తమ శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు ఓ ఎమ్మెల్యేకు..పైగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు ఎలా తెలిశాయో ఆరా తీస్తున్నారట.
- Naveen
- Published On : March 17, 2026 / 11:36 PM IST
- సమ్మక్క-సారలమ్మ జాతర నుంచి ఇద్దరికీ మొదలైన రగడ
- సీపీ గౌస్ ఆలంపై విరుచుకుపడుతున్న కౌశిక్ రెడ్డి
- అవినీతి, అధికార దుర్వినియోగం అంటూ అటాక్
- ఓ థియేటర్ అనుమతి కోసం రూ.లక్షలు వసూళ్లు చేశారని అలిగేషన్స్
- కౌశిక్‌రెడ్డి ఆరోపణలపై నో కామెంట్ అంటున్న సీపీ గౌస్ ఆలం
Padi Kaushik Reddy: జిల్లా పోలీస్ బాస్ టార్గెట్‌గా ప్రతిపక్ష ఎమ్మెల్యే మాటల తూటాలు పేలుస్తున్నారు. తగ్గేదేలే అంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఫైర్ అవుతున్నారు. అయితే ఎమ్మెల్యే ఎన్ని అలిగేషన్స్ చేస్తున్నా ఖాకీలు మాత్రం కామ్‌గా ఉంటున్నారు. సీపీ అధికార దుర్వినియోగం, అక్రమ వసూళ్లు, జల్సాలంటూ సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అంతటితో ఆగకుండా సీపీ ఫ్యామిలీ మెంబర్స్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ఎలా పాల్గొంటారంటూ మరోసారి మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్యే. ఇక త్వరలోనే సీపీ వీడియోలు లీక్ చేస్తానంటున్నారు. ఇంతకు ఎవరా సీపీ? ఆయన టార్గెట్ ఎమ్మెల్యే ఎందుకు వేటాడుతున్నారు? ఎమ్మెల్యే అలిగేషన్స్ వెనుక మ్యాటరేంటి?
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సీపీ గౌస్ ఆలంపై సీరియస్ అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఇష్యూతో హడావుడి చేసే కౌశిక్ రెడ్డి…ఈసారి కరీంనగర్ సీపీని టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య వీణవంక సమ్మక్క జాతరలో తనను అరెస్టు చేశారని..కరీంనగర్ సీపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కౌశిక్. దాంతో ఐపీఎస్ అసోసియేషన్ రంగంలోకి దిగడంతో సారీ చెప్పి ఇష్యూకు పులిస్టాప్ పెట్టినట్లు చేశారు. అంతటితో వివాదం సమసిపోయిందని అంతా భావించిన తరుణంలో..సీపీ గౌస్ ఆలంపై వరుసపెట్టి సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కౌశిక్‌రెడ్డి. కొందరు అధికారులను అడ్డం పెట్టుకుని సీపీ పెద్దఎత్తున అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..కొందరు పోలీసు అధికారుల పేర్లను ప్రస్తావించి..ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకున్నారో కూడా చెప్పేసి ఆధారాలు కూడా త్వరలో బయటపెడతానని స్మాల్ బ్రేకిచ్చారు.
కౌశిక్ ఆరోపణల వెనుక ఇంటి దొంగల పని..!
కౌశిక్ రెడ్డి ఆరోపణలతో పోలీస్ శాఖలో ఉలికిపాటు మొదలైంది. కౌశిక్ అలిగేషన్స్ చేయడానికి సమాచారం ఎవరిచ్చారనేది తేల్చే పనిలో పడ్డారట పోలీస్ లు. తమ శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు ఓ ఎమ్మెల్యేకు..పైగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు ఎలా తెలిశాయో ఆరా తీస్తున్నారట. అయితే కౌశిక్ ఆరోపణల వెనుక ఇంటి దొంగల పని ఉందనేది ఖాకీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సీపీ గౌస్ ఆలం మాత్రం నో కామెంట్ అంటూ..ఇష్యూ సీరియస్ నెస్‌ను తగ్గిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కౌశిక్‌రెడ్డికి, సీపీకి ఎక్కడ చెడిందనేది ఆసక్తికర చర్చగా మారింది.
నాతోనే క్షమాపణ చెప్పిస్తారా? అంటూ రగిలిపోతున్నారట..
ఇసుక క్వారీలు, ఇసుక రవాణా విషయంలో సీపీ కాస్త కఠినంగా వ్యవహరించారు. ఇక పలు సందర్భాల్లో కౌశిక్ సీపీకి ఫోన్ చేశారట. ఎమ్మెల్యే రిక్వెస్ట్‌లను విన్నట్టే విని తర్వాత సీపీ లైట్ తీసుకోవడంతో నొచ్చుకున్నారట కౌశిక్. అప్పటినుంచే సమయం దొరికిన ప్రతీసారి సీపీని టార్గెట్ చేస్తున్నారట కౌశిక్. ఇలా మొదలైన కోల్డ్ వార్ సమక్క సారలమ్మ జాతరలో కౌశిక్‌ను పోలీసులు అడ్డుకోవడంతో మరింత ముదిరినట్టయింది. దాంతో పోలీసులపై చిందులు తొక్కిన కౌశిక్ ఆ తర్వాత క్షమాపణ చెప్పాల్సి రావడంతో మరింత ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. నాతోనే క్షమాపణ చెప్పిస్తారా? అంటూ రగిలిపోతున్నారట కౌశిక్‌రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోపణల డోస్‌ను పెంచుతున్నారట.
సీపీ కుటుంబసభ్యులు పేల్చిన తూటాలంటూ బాంబ్ పేల్చారు..!
సీపీ గౌస్ ఆలంపై అసెంబ్లీ ప్రాంగణం నుంచి మరోసారి ఫైర్ అయ్యారు. కరీంనగర్‌లోని ఎలగందుల గుట్ట దగ్గర పోలీసులు ఫైరింగ్ ట్రైనింగ్ నిర్వహిస్తుంటారు. అయితే గతేడాది ఇక్కడ ఫైరింగ్ చేసిన సందర్భంలో..కొన్ని బుల్లెట్లు బోణాలపల్లి గ్రామస్తులను గాయపరిచాయి. అందరూ పోలీస్ మిస్ ఫైర్ అనుకున్నారు. కానీ కౌశిక్ రెడ్డి అదంతా సీపీ కుటుంబసభ్యులు, ఆయన సన్నిహితులు పేల్చిన తూటాలంటూ బాంబ్ పేల్చారు. ఇక సీపీ వీడియోలు విడుదల చేస్తానంటూ మరింత ఘాటైన విమర్శలకు దిగుతూ వస్తున్నారు కౌశిక్‌రెడ్డి. సీపీ టార్గెట్‌గా కొనసాగుతున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అలిగేషన్స్ ఎటు దారితీస్తాయో చూడాలి.
Also Read: కాంగ్రెస్‌లో ఉండలేక..వీడలేక.. మాజీమంత్రి జీవన్‌రెడ్డి డెసిషన్ ఏంటి?
