Revanth Reddy : నడిపించేది మేమే.. రేవంత్ క్లారిటీ అందుకేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మంటున్న రేవంత్ మరో అంశంపై కూడా పదేపదే క్లారిటీ ఇస్తున్నారు.

Gossip Garage MEME SARATHULAM is Revanth Clarity is the reason

  • వచ్చే ఎన్నికల్లో సారధ్యంపై రేవంత్ స్టేట్‌మెంట్స్‌
  • మహేష్‌గౌడ్ నాయకత్వంపై రేవంత్‌ క్లారిటీ ఎందుకు.?
  • మహేష్‌, తన లీడర్‌షిప్‌లోనే ఎన్నికలంటున్న రేవంత్
  • పీసీపీ చీఫ్‌తో ఎలాంటి గ్యాప్‌ లేదని చెప్పే ప్రయత్నమా.?

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే ఎన్నిక‌ల టాక్ మొదలైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మంటున్న రేవంత్ మరో అంశంపై కూడా పదేపదే క్లారిటీ ఇస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారధిగా మ‌హేష్ గౌడ్ నాయ‌క‌త్వంలోనే జ‌రుగుతాయ‌ని స్పష్టం చేస్తున్నారు. నెక్స్ట్ టర్మ్‌ ఎన్నిక‌లు అయిపోయే వ‌ర‌కు పీసీసీ చీఫ్‌గా మ‌హేష్ గౌడే ఉంటార‌నే సంకేతం పంపిస్తున్నారు.

అయితే మ‌హేష్‌కుమార్‌ గౌడ్‌ను క్యాబినెట్‌లోకి తీసుకుని ఆయన స్థానంలో పీసీసీ చీఫ్‌గా కొత్తవారికి అవ‌కాశం ఇస్తార‌ని కొంతకాలంగా టాక్ నడుస్తోంది. ఈ వార్తలను పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఖండించారు. మ‌రోవైపు కాంగ్రెస్ సాంప్రదాయం ప్రకారం పీసీసీ చీఫ్‌గా మూడేళ్లు మాత్రమే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో అంత‌కంటే త‌క్కువ ఛాన్స్ ఇవ్వొచ్చు. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో ఎక్స్‌టెన్షన్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

AP TS DELIMITATION : 2029 నాటికి ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్.!?

పీసీసీ చీఫ్‌గా మ‌హేష్ గౌడ్ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. మ‌రో ఏడాదిలో ఆయన పదవీకాలం ముగుస్తుంది. కానీ అంతకంటే ముందే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుని పార్టీ స్టేట్‌ ప్రెసిడెంట్ పోస్ట్‌ను మరో నేతలకు ఇస్తారని కాంగ్రెస్‌లో రకరకాల చర్చలు జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్‌ మధ్య గ్యాప్ ఉంద‌నే గాసిప్స్ కూడా చక్కర్లు కొట్టాయి. వీట‌న్నింటికి చెక్ పెట్టేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే రంగంలోకి దిగార‌ట‌.

పీసీపీ చీఫ్‌తో ఎలాంటి గ్యాప్‌ లేదని చెప్పే ప్రయత్నమా ?

రెండున్నరేళ్ల త‌ర్వాత వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎల‌క్షన్స్ మ‌హేష్ కుమార్ గౌడ్ నాయ‌క‌త్వంలోనే జ‌రుగుతాయ‌ని కాటారం బ‌హిరంగ స‌భ వేదిక‌గా మ‌రోసారి స్పష్టం చేశారు రేవంత్. పీసీసీ చీఫ్‌గా మ‌హేష్ గౌడ్‌, సీఎంగా తానుఇద్దరి నాయ‌క‌త్వంలోనే ఎన్నిక‌లకు వెళ్తామని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు గ‌తంలో పీసీసీగా డీఎస్, సీఎంగా వైఎస్ నాయ‌క‌త్వంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ట్లుగా.. పీసీసీగా మ‌హేష్ గౌడ్‌, సీఎంగా తన నాయ‌క‌త్వంలో తెలంగాణలో సెకండ్‌ టైమ్‌ పవర్‌లోకి వస్తామని చెప్పుకొస్తున్నారు రేవంత్‌.

స్వయంగా సీఎం ఈ కామెంట్స్ చేస్తుండ‌టంతో మ‌హేష్‌కుమార్‌ గౌడ్ పదవి మార్పుపై వస్తున్న డౌట్స్‌ను ప‌టాపంచ‌లు చేసినట్లేనన్న టాక్ నడుస్తోంది. పీసీసీని పూర్తిగా వెన‌కేసుకొస్తూ ఆయ‌న్ను సీఎం పొగ‌డ్తల‌తో ముంచెత్తడం చూస్తుంటే తమ మ‌ధ్య ఎలాంటి గ్యాప్ లేద‌నే ఇండికేష‌న్‌ ఇచ్చార‌న్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌కు వ‌చ్చే జ‌న‌ర‌ల్ ఎల‌క్షన్స్ వ‌ర‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింద‌నే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే సీఎం రేవంత్ రెడ్డి..పీసీసీ చీఫ్‌ విష‌యంలో ఓపెన్ డయాస్‌ మీద స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారని అని కూడా అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు పీసీసీ చీఫ్‌గా మ‌హేష్ గౌడే ఉంటారా.? లేక లాస్ట్ మూమెంట్‌లో ఈక్వేష‌న్స్ ఏమైనా మారుతాయా అనేది వేచి చూడాలి మరి.