AP TS DELIMITATION : 2029 నాటికి ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్.!?
దేశవ్యాప్తంగా సీట్ల పెంపు జరిగినా, జరగకపోయినా ఏపీ, తెలంగాణలకు ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (AP TS DELIMITATION)జరిగి తీరుతుందన్న అంచనాలు ఉన్నాయి
Gossip Garage Delimitation in AP and Telangana by 2029
- రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై కూటమి హోప్స్
- డీలిమిటేషన్ జరిగితే సీట్ల షేరింగ్ ఈజీ అవుతుందని లెక్కలు
- అసెంబ్లీ స్థానాలు పెరిగితే వైసీపీకి మరిన్ని సవాళ్లు తప్పవా.?
లోక్‌సభ సీట్ల పెంపునకు ప్రతిపక్షాలు వేసిన బ్రేకులతో కేంద్రం మరో రూట్లో వస్తోంది. ఇంకో ఆరు నెలల్లో ప్రెష్‌గా బిల్లు తెచ్చి తీరుతామని పట్టుదలతో ఉంది. అయితే దేశవ్యాప్తంగా సీట్ల పెంపు జరిగినా, జరగకపోయినా.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందన్న అంచనాలు ఉన్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జనగణన తర్వాత తెలుగు స్టేట్స్లో డీలిమిటేషన్ చేస్తారని అంటున్నారు.
ఒకవేళ దేశవ్యాప్తంగా సీట్ల పెంపునకు లైన్ క్లియర్ కాకపోతే ఏపీ, తెలంగాణలో ప్రత్యేక డీలిమిటేషన్‌కు అవకాశం ఉందని చెబుతున్నాయి పార్టీలు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. ఏపీ విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం అయితే మహిళా కోటా, లోక్‌సభ సీట్ల పెంపుతో దీనికి సంబంధం లేదు. 2026 తర్వాత జనగణన లెక్కలు బయటికి వచ్చాక డీలిమిటేషన్ జరిపి ఏపీ, తెలంగాణలో సీట్లు పెంచుతామని కేంద్రం..పార్లమెంట్ వేదికగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు గతంలో సమాధానం చెప్పింది.
అయితే ఏపీలో కూటమి అయితే డీలిమిటేషన్‌పై ఫుల్ హోప్స్ పెట్టుకుంది. ఇప్పుడున్న 175 సీట్లు 225కు పెరిగితే కొత్తగా 50 మందికి అవకాశాలు దక్కనున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలకు సీట్ల అడ్జస్ట్మెంట్..ఆశాహులకు టికెట్ల కేటాయింపు ఈజీ కానుంది. గత ఎన్నికల టైమ్‌లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంచాయితీ ఆఖరి వరకు తెగకుండా ఆలస్యం కాగా..టీడీపీలో సీట్ల కోసం తీవ్ర పోటీ కనిపించింది.
అసంతృప్తులు రోడ్లెక్కిన పరిస్థితి. పైగా సీట్ల త్యాగం అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సీట్లు పెరిగితే కూటమి పార్టీల మధ్య పంపకాలు ఈజీ అవడంతో పాటు సాధ్యమైనంత వరకు ఆశావహులు అందరికీ టికెట్ దక్కే అవకాశాలు ఉంటాయి. అందుకే కూటమి డీలిమిటేషన్‌పై ఆశతో ఉంది. ఇక విపక్ష వైసీపీకి వచ్చే సరికి పరిస్థితి మరోలా ఉంది. ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకుకే బలమైన అభ్యర్థులు లేరని..ఇక 225 సీట్లకు పెరిగితే అభ్యర్థుల కోసం ఆ పార్టీ అపసోపాలు పడాల్సి వస్తుందని అంటున్నారు.
కేంద్రం రిస్క్ తీసుకుంటుందా?
అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు అనుగుణంగా మారిస్తే తప్ప రెండు రాష్ట్రాల్లో సీట్లను పెంచలేమని సుప్రీం కోర్టుతో పాటు కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో జనగణన పూర్తయి డీలిమిటేషన్‌ను నిర్వహించినా..ఏపీ పునర్విభజన చట్టాన్ని సవరించకుండా అసెంబ్లీ సీట్లను మార్చడం కుదరదని అంటున్నారు. అయితే కేంద్రం ప్రతిపాదించినట్లు ఫిఫ్టీ పర్సెంట్ సీట్ల పెంపు జరిగితే..ఏపీలో అసెంబ్లీ సీట్లు 265కు పెరిగే అవకాశాలున్నాయి.
జనాభా ప్రాతిపదికనగా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టినా, విభజన చట్టం ప్రకారం బిల్లు పెట్టినా..ఫిఫ్టీ పర్సెంట్ సీట్ల పెంపుతో ఏపీలో అసెంబ్లీ ఎక్కువ స్థానాలు ఎక్కువగా పెరగనున్నాయి. ఏపీ, తెలంగాణలో 2028 చివరిలో అసెంబ్లీ సీట్ల పెంపు జరిగే అవకాశం ఉంది. అయితే ఆర్టికల్ 170ని సెక్షన్ 26ను అనుగుణంగా మార్చే రిస్క్ కేంద్రం తీసుకుంటుందా.? లేదా.? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్టెప్ తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
సీట్లు పెరిగితే మరికొంతమందికి ఎమ్మెల్యేలు, మంత్రులుగా పని చేసే అవకాశం దక్కుతుంది. ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్ సీట్లు కూడా జనాభా ప్రాతిపదికన మారతాయి. మరోవైపు నియోజకవర్గాలు మారితే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల రాజకీయ భవిష్యత్తు మారొచ్చు. కొత్త రిజర్వేషన్లు, పునర్విభజనతో కొందరు నాయకులు స్థానాలు గల్లంతయ్యే అవకాశం ఉంది. కేంద్రం దేశవ్యాప్తంగా ఒకేసారి డీలిమిటేషన్ చేస్తుందో లేక ఏపీ పునర్విభజన చట్టానికి లోబడి సీట్లు పెంచుతుందో లేదో అనేది వేచి చూడాలి మరి.
