KCR: ఈసారి వారికి కారులో సీటు కష్టమే? గులాబీ బాస్ కామెంట్స్‌తో లీడర్లలో గుబులు..
ఇక కొందరు పార్టీ ఎమ్మెల్యేలపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని అధినేత కామెంట్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో ఉంటారో..కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్తారో తేల్చుకోవాలని ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ గులాబీ బాస్ హెచ్చరించడం చర్చనీయాంశం అవుతోంది.
- Naveen
- Updated on- April 28, 2026 / 09:48 PM IST
- టికెట్ ఆశావహులకు బీఆర్ఎస్ షాక్ ఇవ్వబోతోందా?
- సిట్టింగ్‌లు, ఎక్స్ ఎమ్మెల్యేల్లో కొందరికి టికెట్ కట్టేనా?
- గులాబీ బాస్ కామెంట్స్‌తో లీడర్లలో గుబులు మొదలైందా?
KCR: నో ఎమోషన్స్. నోమోర్ కండీషన్స్. మళ్లీ పవర్‌లోకి రావాలంటే అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు. అంతకు మించి అన్నట్లుగా నడుచుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్ కేసీఆర్. గెలిచే అవకాశం లేని మాజీ ఎమ్మెల్యేలకు టికెట్స్ డౌటే ఇండికేషన్ ఇచ్చేశారట. సేమ్‌టైమ్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కూడా కొందరికి హ్యాండ్ ఇవ్వడం పక్కా అన్న టాక్ నడుస్తోంది. పక్క చూపులు చూస్తున్న వారిని పక్కన పెట్టేస్తారా? ఈ సారి కారు పార్టీది గెలుపు మంత్రమేనా?
బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ చేసిన కామెంట్స్ గులాబీదళంలో గుబులు పుట్టిస్తున్నాయి. ఎస్పెషల్‌గా ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల్లో అయితే టెన్షన్ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. చాలామందికి టికెట్ టెన్షన్ పట్టుకుందన్న చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్‌తో..వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం అంత ఆశామాషీ కాదని భావిస్తున్నారట నేతలు.
ఇన్నాళ్లు పార్టీ లీడర్లు ఏం చేసినా చూసీ చూడనట్లు వదిలేశానన్న గులాబీ బాస్..ఇకపై అలా కుదరదని స్పష్టం చేశారట. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని..సోషల్ మీడియాలో హల్‌చల్ చేసి ఆ తర్వాత సైలెంట్‌గా ఉంటామంటే కుదరదని నిర్మొహమాటంగా చెప్పేశారట. వచ్చే ఎన్నికల్లో నిరంతరం జనంలో ఉండే వారికే అవకాశాలు దక్కుతాయని అన్నారట. గత ఎన్నికల్లో చేసిన కొన్ని పొరపాట్లు ఈ సారి చేయదలుచుకోలేదనే కూడా ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చారట కేసీఆర్. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లలో అప్పుడే ఆందోళన స్టార్ట్ అయిందన్న చర్చ జరుగుతోంది.
25 మంది తమకు టికెట్ దక్కడం డౌటే..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 25 నుంచి 30 మంది సిట్టింగులను మార్చాలని బీఆర్ఎస్‌లో ఇంటర్నల్ డిస్కషన్ జరిగింది. సర్వే రిపోర్టులు, కొందరు ఎమ్మెల్యేలపై వచ్చిన అలిగేషన్లతో..కొన్ని చోట్ల సిట్టింగ్‌లను మార్చాలని భావించారు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం..రెండు, మూడు సీట్లలో మినహా మిగతా చోట్ల సిట్టింగ్‌లకే టికెట్లు ఇచ్చారు. అలా మారుద్దామని అనుకున్న చోట్ల ఎమ్మెల్యేలంతా ఓటమిపాలయ్యారు. సిట్టింగ్‌లను మార్చిన జనగామ, వేములవాడ వంటి సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది. దాంతో బీఆర్ఎస్ అధిష్టానం రియలైజ్ అయిందని అంటున్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లకు ఈ సారి టికెట్లు కష్టమేనన్న సంకేతాలు ఇచ్చేశారట బీఆర్ఎస్ అధినేత. దీంతో గత ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో..దాదాపు 25 మంది తమకు టికెట్ దక్కడం డౌటేనన్న డైలమాలో పడేపోయారట. ఈ లిస్ట్‌లో మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లు కూడా ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది.
ఇక కొందరు పార్టీ ఎమ్మెల్యేలపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారని అధినేత కామెంట్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో ఉంటారో..కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్తారో తేల్చుకోవాలని ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ గులాబీ బాస్ హెచ్చరించడం చర్చనీయాంశం అవుతోంది. ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీకి టచ్‌లో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ వార్నింగ్‌తో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తెలియని అలజడి ఏర్పడిందట. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరంటూ కారు పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ కమిటీలను పటిష్టం చేయబోతున్న కేసీఆర్..గెలుపు గుర్రాలకు..లాయలిస్టులకే టికెట్లు ఇస్తామని చెప్పకనే చెప్పారని అంటున్నారు గులాబీ లీడర్లు.
Also Read: ఒక దెబ్బకు రెండు పిట్టలు..! కాళేశ్వరం సెంట్రిక్‌గా సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్..
