తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ట్రాన్సఫర్ అయినట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. నరసింహన్ స్థానంలో గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన వ్యక్తిని కానీ లేదా కేరళ గవర్నర్ సదాశివంను కానీ నియమించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
కొంతకాలంగా గవర్నర్ బదిలీ అవుతారని కశ్మీర్‌కు వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చారు. రాజ్‌భవన్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా గవర్నర్ మార్పుకు సంబంధించే అని చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో గవర్నర్ మార్పుపై గ్రీన్ సిగ్నల్ దొరికేసినట్లే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నరసింహన్‌కు తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా పనిచేసిన ఘనత దక్కుతుంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్ గా కూడా ఆయన గుర్తింపు పొందారు.