Kamareddy : పెళ్లి ఇంట్లో విషాదం.. వివాహం జరగాల్సిన రోజే వరుడు ఆత్మహత్య

పెళ్లి కార్డులు బంధువులకు పంచడానికి సెప్టెంబర్ 3వ తేదీన రాజేందర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

groom ends life it self

Kamareddy Groom Ends Life It Self  : కామారెడ్డి జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ (29) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతితో ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేందర్ పెళ్లి నిశ్చయం అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి కార్డులు బంధువులకు పంచడానికి సెప్టెంబర్ 3వ తేదీన రాజేందర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నిన్న (గురువారం) పెళ్లి జరగాల్సిన రోజే లింగంపేట మండలం ఎల్లారం గేటు సమీపంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మృతదేహం లభ్యం అయింది.

Bride Died : పెళ్లింట విషాదం.. రిసెప్షన్ జరుగుతుండగానే నవ వధువు మృతి

దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నలింగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.