Bride Died : పెళ్లింట విషాదం.. రిసెప్షన్ జరుగుతుండగానే నవ వధువు మృతి
పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న సమయంలోనే పెళ్లి కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం బెంగుళూరు నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యారు.

Bride Dead
bride dies in karnataka : కర్నాటకలో పెళ్లింట విషాదం నెలకొంది. రిసెప్షన్ లోనే నవ వధువు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని శ్రీనివాసపురం తాలుకాకు చెందిన రామప్ప కుమార్తె చైత్ర (26) కైవార కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో హొసకోటకు చెందిన యువకుడితో చైత్రకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 6వ తేదీన వీరి వివాహం శ్రీనివాసపురంలో జరగాల్సివుంది.
అయితే పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న సమయంలోనే పెళ్లి కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం బెంగుళూరు నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా చికితస పొందుతున్న ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు.
ఆమె మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయదానం చేసి తల్లిదండ్రులు మానవత్వాన్ని చాటుకున్నారు.