Traffic Restrictions : నగరవాసులకు అలర్ట్.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆవైపు అస్సలు వెళ్లకండి

Traffic Restrictions : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

hanuman jayanti 2026 traffic restrictions in hyderabad due to vijay yatra rally

  • నేడు నగరంలో వీర హనుమాన్ విజయ యాత్ర
  • గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు ప్రధాన యాత్ర
  • యాత్ర సాగే దారుల్లో రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు

Traffic Restrictions : హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో గురువారం ‘శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర’ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రధాన యాత్ర ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామాలయం వద్ద ప్రారంభం అవుతుంది. రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్ వీరాంజనేయ ఆలయం వద్ద ముగుస్తుంది. దీంతో పాటు కర్మన్‌ఘాట్ హనుమాన్ గుడితో పాటు మల్కాజిగిరి వంటి ప్రాంతాల నుంచి వచ్చే 14 ఉప ఊరేగింపులు ఈ ప్రధాన యాత్రలో కలుస్తాయి. కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి మొదలయ్యే ఉపయాత్ర.. చంపాపేట్, ఐఎస్ సదన్, సైదాబాద్, మూసారాంబాగ్ మీదుగా కోఠి వద్ద ప్రధాన యాత్రలో కలవనుంది. మొత్తం యాత్ర 12.5 కిలోమీటర్లు సాగుతుంది.

వీర హనుమాన్ విజయ యాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పటిష్టమైన ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సిటీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీర హనుమాన్ విజయ యాత్ర సాగే మార్గాల్లో వాహన రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు ఈ ర్యాలీ సికింద్రాబాద్‌కు చేరుకునే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాల నుంచి బషీర్‌బాగ్‌ వైపు వెళ్లాలనుకునే వారు వేరే మార్గాల్లో ప్రయాణం చేయాలని సూచిస్తున్నారు.

విజయ యాత్ర నేపథ్యంలో నాంపల్లి, అబిడ్స్, సుల్తాన్ బజార్, నారాయణగూడ ప్రాంతాల నుంచి ఎంజే మార్కెట్ వైపు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎల్బీ నగర్ వరకు రద్దీ భారీగా ఉంటుందని.. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626కు, అలాగే మల్కాజిగిరి పరిధిలో 112, 8712662999, 8712662850 నంబర్లకు కాల్ చేయవచ్చు. అలాగే శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాహనాలను దారి మళ్లించనున్నారు. గౌలిగూడ హనుమాన్ గుడి వద్ద శోభాయాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్ర సాగే మార్గాల్లో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ప్రయాణికులు, వాహనదారులు వీటిని గమనించి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.