HARISH RAO
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇచ్చి, ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. హామీల అమలు విషయంలో ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇవాళ హరీశ్ రావు మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు.
మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పథకాలు అమల్లోకి రావాలని, లేదంటే అవి ఎప్పుడు అమలు అవుతాయో ఎవరికీ తెలియదని హరీశ్ రావు అన్నారు. హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. హామీలు అమలు కాకపోవడానికి కారణం ఎన్నికల కోడేనని కాంగ్రెస్ ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఫిబ్రవరి చివరి నాటికి ఆరు పథకాలు అమలు అయితేనే ప్రజలకు ఇబ్బంది ఉండదని లేదంటే.. దాదాపు నాలుగు నెలలు వేచి చూడాల్సి వస్తుందని చెప్పారు.
ఫిబ్రవరిలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోతే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు కావని హరీశ్ రావు అన్నారు. గ్యారంటీల అమలుకు గైడ్ లైన్స్ లేకుండానే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తరువాత హామీలను పట్టించుకోరన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.
Jd Seelam: న్యూ ఇయర్ వేడుక తర్వాత షర్మిల కాంగ్రెస్‌లోకి..: కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం