Harish Rao: మీకు దమ్ముంటే.. వెంటనే వాటి ధరలు తగ్గించండి- సీఎం రేవంత్ కి హరీశ్ డిమాండ్

మీది ప్రజా పాలన కాదు, పన్నులు దండుకునే ప్రజా పీడన పాలన అంటూ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

  • Updated on- May 25, 2026 / 07:13 PM IST

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు అని సీఎం రేవంత్ ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నుల భారం వెంటనే తగ్గించాలన్నారు హరీశ్ రావు. పెరిగిన ఏడున్నర రూపాయల్లో రెండున్నర స్టేట్ వ్యాట్ ఉందని ఆయన తెలిపారు. రూ. 115 పెట్రోల్ ధరలో 35 శాతం స్టేట్ వ్యాట్ ఉందని వెల్లడించారు. రూ.103 డీజిల్ ధరలో 27 శాతం స్టేట్ వ్యాట్ ఉందన్నారు. ప్రజలపై నెలకు రూ. 162 కోట్లు, ఏటా 2 వేల కోట్ల పన్నుల భారం పడుతోందని వాపోయారు. మీది ప్రజా పాలన కాదు, పన్నులు దండుకునే ప్రజా పీడన పాలన అంటూ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు హరీశ్ రావు. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: వారికి షాక్ ఇచ్చిన సర్కార్.. రేషన్ కార్డులు కట్.. కారణమిదే.. మీ పేరు ఉందేమో చెక్ చేసుకొండి