Warangal Prison Land: వరంగల్ జైలు స్థలం.. ఆరోగ్య శాఖ చేతుల్లోకి

వరంగల్ సెంట్రల్ జిల్లా పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలో క్వాలిటీ హెల్త్ కేర్ అందించేందుకు ప్రిజన్స్ డిపార్ట్‌మెంట్‌ను తరలించే పనిలో పడ్డారు.

Warangal prison land: వరంగల్ సెంట్రల్ జిల్లా పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర తెలంగాణలో క్వాలిటీ హెల్త్ కేర్ అందించేందుకు ప్రిజన్స్ డిపార్ట్‌మెంట్‌ను తరలించే పనిలో పడ్డారు. సీఎంతో మే 9న జరిగిన సమావేశంలో వరంగల్‌ జైలును తరలించి, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జైల్లో ఖైదీల తరలింపు, ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కట్టడాల కూల్చివేత వరకూ పనులు పూర్తిచేయించారు. జూన్ 20న వరంగల్‌ సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. అదే రోజు కొత్త దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేస్తారని విశ్వసనీయ సమచారం. 20 అంతస్థులతో నిర్మించే కొత్త భవనంలో లేటెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించనున్నారు.

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వీలుగా హోంశాఖ ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్యశాఖకు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖైదీలను తరలించాలని మే 31న హోంశాఖ ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. జూన్ 1న మొదలైన ఖైదీల తరలింపు ప్రక్రియ 11 నాటికి పూర్తయింది.

వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌తో తూర్పు, ఈశాన్య తెలంగాణలోని 12 జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. జైలు ఆవరణలో 73 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అందులో 5 ఎకరాలను కాళోజీ హెల్త్‌ వర్సిటీకి కేటాయించి కొత్త భవనాన్ని నిర్మించారు. మిగిలిన స్థలంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు