Telangana Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rain Alert : ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్పపీడన ప్రాంతాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు మరింత బలపడి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
- Harish Thanniru
- Published on- July 1, 2026 / 08:11 AM IST
Heavy Rain in Telangana
- తెలంగాణకు రెయిన్ అలర్ట్
- వేగం పుంజుకున్న నైరుతి రుతుపవనాలు
- నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
Telangana Rain Alert : తెలంగాణలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు వర్షాలపై కీలక విషయాన్ని వెల్లడించారు. ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read : Rythu Bharosa : రైతుభరోసా నిధులు మీబ్యాంక్ ఖాతాలో పడలేదా..? వెంటనే ఇలా చేయండి.. మీ ప్రాబ్లం క్లియర్..
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. మొన్నటి వరకు కాస్త నెమ్మదిగా ముందుకు కదలిన రుతుపవనాలు.. గత నాలుగు రోజులుగా వేగం పుంజుకున్నాయి. ఈ కారణంగా రాబోయే 24గంటల నుంచి 72గంటల వ్యవధిలో తెలంగాణతోపాటు దేశంలోని మరో 23 రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
మరోవైపు.. ఈ వారంలో బంగాళాఖాతంలో వరుసగా రెండు శక్తివంతమైన అల్పపీడన ప్రాంతాలు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా రుతుపవనాలు మరింత బలపడి విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
వాతావరణ శాఖ అధికారులు అంచనా ప్రకారం.. జులై 1వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ (బుధవారం) అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
