Telangana Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ

అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం అసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Telangana Heavy Rains

Yellow – Orange Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ (Telangana) అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం అసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ చేసింది.

Heavy Rains : రానున్న ఐదు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ

ఇక ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్జ్ జారీ చేసింది. గురువారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాతారణ శాఖ హెచ్చరికలతో సీఎస్ శాంతికుమారి అలర్ట్ అయ్యారు. సీనియర్ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని చెప్పారు.