Rains In Telangana : తెలంగాణలో ఎల్లుండి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ గ్యాంగ్‌టక్ పరిసర ప్రాంతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 10 కిలోమీటర్లు ఎత్తువరకు ఆవరించి ఉంది.

Rains In Telangana

Rains In Telangana : బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ గ్యాంగ్‌టక్ పరిసర ప్రాంతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 10 కిలోమీటర్లు ఎత్తువరకు ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు,రేపు తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి శుక్రవారం అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా  పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.